తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల చైర్మన్లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి మంగళవారం హైదరాబాద్ వచ్చారు. ఆయన నేరుగా టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లికార్డునరెడ్డికి బాజిరెడ్డి ఘనస్వాగతం పలికారు.ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సేవలపై చర్చించినట్లు బాజిరెడ్డి ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్లు ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య మెరుగైన సంబంధాల దిశగా చర్చలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa