జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాపులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన మహిళ నేత ఉషా కిరణ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆమె మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాపులకు ఏమాత్రం గౌరవం లేదని ఆమె పేర్కొన్నారు. కాపులలో ఓటు బ్యాంకు గానే వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.