ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని కార్పొరేటర్ కొణతాల నీలిమభాస్కర్అన్నారు. పట్టణంలోనిగవరపాలెం, అరుంధతి నగరం 80వ వార్డ్ 19, 22, సచివాలయ పరిధిలో చేయూత పథకం లబ్ధిదారులతో అవగాహనసదస్సుమంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. గతఏప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని కొనియాడారు. ప్రతి సంవత్సరం 45 సంవత్సరాల నిండిన మహిళలకు చేయూత పథకం రాజకీయాలకు అతీతంగా ప్రతిమహిళకు అందిస్తున్నామని ఆమెతెలియజేశారు. చేయూత పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ స్కూల్ దీటుగా నాడు-నేడు పథకం
ద్వారాప్రభుత్వస్కూలు, కార్పొరేట్ స్కూల్ కి దీటుగా అభివృద్ధి చేస్తున్నారని, పేదవిద్యార్థులకు కార్పొరేట్ విధ్యతోపాటు ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం అమ్మ ఒడితోపాటు పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు. పొలిమేరమణ, కాండ్రేగుల రాము, కాండ్రేగుల విశ్వేశ్వరరావు, కేఎం నాయుడు, ఆళ్ల శంకర్రావు, కెప్టెన్ అప్పారావు, మద్దాల భీమేష్, పెంటకోట సన్యాసినాయుడు, పెట్ల నాగేశ్వరావు, మహిళలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.