ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో యూజర్లు బ్లూటిక్ వెరిఫికేషన్ కావాలనుకుంటే అందుకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. యూజర్లు కొత్తగా బ్లూ టిక్ కావాలనుకున్నా, ఉన్నది నిలుపుకోవాలనుకున్నా నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాలని మస్క్ మంగళవారం తెలిపారు. బ్లూ టిక్ పొందిన యూజర్లకు ఎడిట్ ఆప్షన్‌తో పాటు అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.