ఏపీలోని అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన తగిలింది. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దొప్పెర్ల గ్రామానికి ఎమ్మెల్యే బుధవారం వెళ్లారు. ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష పాటిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.