గుంటూరు జిల్లా రవాణశాఖకు అక్టోబరు నెలలో రూ. కోటీ 53 లక్షల ఆదాయాన్ని సాధించి 169. 25 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు జిల్లా ఉపరవాణ కమిషనర్ షేక్ కరీం మంగళవారం తెలిపారు. నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలపై అక్టోబరు నెలలో మొత్తం 2281 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పన్నులు, పెనాల్టీల రూపంలో రూ. 20, 88, 650, జరిమానాల కింద రూ. 1, 30, 61, 352, ఇతర ఆదాయం ద్వారా రూ. 1,50,000 వసూలు చేసినట్టు పేర్కొన్నారు.