జన చైతన్య యాత్ర కార్యక్రమములో భాగముగా బుధవారం సాయంత్రం 03: 00 గంటలకు తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు గ్రామం నందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి జన చైతన్య యాత్ర నిర్వహించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించడం తో పాటుగా, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొని విజయవంతము చేయవలసిందిగా ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు కోరాయి.