ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకుల మీటింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 12:09 PM

మడకశిర: మడకశిర జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం అనేది ఒక ఎస్సి నియోజకవర్గం. కానీ ఇక్కడ దళితులకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంకా రాజరికపాలని ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందని అన్నారు. ఎప్పుడు దళితులను చిన్నచూపు చూస్తే రాజకీయ నాయకులే ఉన్నారు కానీ ఇంత వరకు దళితవాడలను గాని, దళిత యువతీ యువకులు గాని ఉన్నతమైన చదువుల కోసం గానీ వారి జీవన విధానాల గురించి గానీ ఆలోచించిన పాపాన పోలేదు. ఎక్కడ ఉన్న పాకలు అలాగే ఉన్నాయి. ఎలాంటి చదువుకోవడం గానీ మంచి వాతావరణంలో ఉండాలని భావన మా దళితవాడలకు ఉండదు. ఎక్కడ వెళ్లిన కించపరిచే మాటలు ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కొనసాగిస్తున్నాయంటే ఎంతో దురదృష్టకరమన్నారు.

జనసేన పార్టీ మడకశిర నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల పోరాటానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు గళం విప్పుతుంది ఎలాంటి రాజకీయ బెదిరింపులకు గాని వ్యక్తిగత దూషణలు గాని అసభ్యకరమైన పదజాలం వాడడం మా పార్టీ సిద్ధాంతం కాదని అన్నారు. ప్రజల సంక్షేమమే యావత్ మంది ప్రజానీకానికి ఒక మంచి అభివృద్ధి కలిగిన సమాజాన్ని ఇవ్వడమే మా జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఎలాంటి సమయంలో ఎలాంటి ప్రజానీకం వచ్చి జనసేనపార్టీ అండదండలు కావాలని వచ్చిన వారికి అనుక్షణం మీ కోసం ఉంటామని బాధ్యతగల రాజకీయాన్ని చేయడానికి ప్రజల కోసమే ఉందని తెలియజేస్తున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com