గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందింస్తున్నట్లు అనంతపురం జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాపరిషత కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి ఆధార్ నమోదుకు సంబంధించిన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన మాట్లాడుతూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 663 సచివాలయాలకు గాను ఇప్పటివరకు 133 ఆధార్ కిట్లు అందించామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.