రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆగపించారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎత్తి చూపినందుకు ఇలాంటి అరెస్టులు చేయడం సిగ్గుచేటు అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా తీర్పులో జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని పేర్కొన్నారు.