పెద్దపప్పూరు: రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని హెచ్ ఓ ఉమాదేవి రైతులకు వివరించారు. బుధవారం పసలూరు ఆర్బీకేలోని గార్లదిన్నెలో వైఎ స్సార్ తోటబడిలో భాగంగా వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. పంట తోటల సాగు ఆశించిన దిగుబడి సాధించాలంటే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, ఆముదం, కానుగ, వేప ఎరువులను వాడాలన్నారు. వర్షాకాలంలో అరటిలో ఎక్కువగా సిగటోకా తెగులుతో ఆకులపై మచ్చలు ఏర్పడి కాయనాణ్యత దెబ్బతినడంతో పాటు పంట దిగుబడి తగ్గే అవకాశముందన్నారు. వీహెచ్ ప్రవీణ, గార్లదిన్నె, పసలూరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.