టీడీపీ సీనియర్ నాయకులూ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు అరెస్ట్‌ను నిరసిస్తూ... విజయవాడ, గాంధీనగర్‌లో టీడీపీ నేత బోండా ఉమ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. అయ్యన్నను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.... అయ్యన్న, ఆయన కుమారుడు అరెస్ట్ అక్రమమని, రాష్ట్రంలో తాడేపల్లి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులపై హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa