టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి అరెస్టుతో బీసీలకు సంబంధమేంటి? అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. కులం కార్డు అడ్డుపెట్టుకొని సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని సూచించారు. అయ్యన్నపాత్రుడు అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.