తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు అరెస్టును నివసిస్తూ కుప్పంలో గురువారం టిడిపి నేతల నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్నపాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, సిఐడి డౌన్లోడ్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎస్సీ , ఎస్టీ , బీసీలపై దౌర్జన్యాలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, అన్న క్యాంటీన్లపై వైసిపి దౌర్జన్యం సరికాదు అన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న అయ్యన్నపాత్రుడని అర్ధరాత్రిలో అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదు హితువు పలికారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్, స్థానిక కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.