కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనంని గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.