గుంటూరుకు చెందిన సీనియర్ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు కోర్టులో రాజీపడ్డారు. 2010లో రాయపాటి చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ అప్పట్లో పరువునష్టం దావా వేశారు. ఈ వివాదంపై విచారణ ముగిసింది. మంగళవారం 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎదుట నేతలిద్దరూ హాజరయ్యారు. దాదాపు 12ఏళ్ల తర్వాత తన వ్యాఖ్యలను రాయపాటి ఉపసంహరించుకోగా, పరువునష్టం దావాను లక్ష్మీనారాయణ వెనక్కి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa