పులివెందుల ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది పనితీరుతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం కడప నుంచి మందులు మాత్రలతో కూడిన వ్యాన్ పులివెందుల ఏరియా ఆసుపత్రికి చేరుకుంది. వాటిని సంబంధిత గదికి చేర్చేందుకు అధికారులు నానా అవస్థలు పడ్డారు. కడప నుంచి పులివెందుల ఆసుపత్రికి చేరింది. మందులు, మాత్రలను దించుటకు గదికి తరలించాల్సి ఉంది. పక్కనే ఉన్న సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సాయంతో చేయమని బతిమాలిన ఏ ఒక్కరూ పలక పోవడంతో అధికారులు తీవ్రత అసహనం వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి సిబ్బంది పనితీరు చూసి రోగులు చర్చించుకోవడం కనిపించారు.