చెన్నూరు మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉడికిన గుడ్లు నల్లగా మారడంపై జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం చెన్నూరు ఉర్దూ ప్రాథమిక పాఠశాలను డీఈవో సందర్శించారు. మధ్యాహ్నం భోజనం సంబంధించి, ఉడికిన గుడ్లు నల్లగా మారడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ లతో చర్చించారు. చెన్నూరు మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కూడా గుడ్లు నల్లగా మారడంపై గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ వారిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే మెమోలు జారీ చేయడం జరుగుతుందని ఉపాధ్యాయులకు సూచించారు. వంట ఏజెన్సీ వారు తయారు చేసిన భోజనము కూరలు గుడ్లు పరిశీలించిన తర్వాతే పిల్లలకు ఇవ్వాలన్నారు. నల్లగా మారిన గుడ్లను వాడరాదన్నారు.