ప్రతి ఒక్కరు రాష్ట్రం కొరకు దేశం సమగ్రత కొరకు పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని అలాగే దేశ పారదర్శకత కొరకు జవాబు దారి తనంగా, దేశ రాష్ట్ర సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అండ్ డెన్ఫోర్స్మెంట్ సీఐ జి ఈదు భాష తెలిపారు. గురువారం చెన్నూరు ప్రజా పరిషత్ సభ భవనంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈదురు భాష మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు దేశ, రాష్ట్ర, ప్రభుత్వాలు చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించడంలో భాగంగా మండల అధికారులంతా కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులంతా జవాబు దారితనంగా, పారదర్శకంగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఆయన తెలియజేశారు. మన దేశం మన ప్రగతి, మన ప్రజలు, అనే విధంగా ప్రతి ఒక్క అధికారి భావించి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులు అందరూ చేత "దేశ సమగ్రత ప్రతిజ్ఞ" చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ వెస్లీ, ఏజీ మైన్స్ అధికారి జి శ్రీనివాసులు, ఏవో బాలగంగాధర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.