మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్‌ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు. సీఆర్పీసీ 41ఏ కింద వారికి నోటీసులు ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భూకబ్జా, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో నేరపూరిత కుట్ర చేశారంటూ సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు.