పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ ఈరోజు ర్యాలీ నిర్వహించారు. అతను కంటైనర్ వాహనంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.