ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవిలో విజయబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి హాజరయ్యారు.