ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేసిన ఘటనపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. రోడ్ షోలో పడిన రాయిని చంద్రబాబే విసిరారని రమేష్ అన్నారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించిన మంత్రి.. రాళ్లు రువ్వడం ఆ కుట్రలో భాగమేనన్నారు. అయితే ఈ దాడిలో సెక్యూరిటీ అధికారి గాయపడడం బాధాకరం. దాడిలో గాయపడిన అధికారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.