తెలుగుదేశం అధినేత చంద్రబాబు రోడ్‌షోలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లు విసిరారు. చంద్రబాబు కాన్వాయ్‌పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గాయపడ్డారు. రాళ్లు రువ్వడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రోడ్‌షోకు జనం భారీగా తరలిరావడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.