కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ఛత్తీస్గఢ్లో రైతుల రుణమాఫీపై హామీ ఇచ్చి అమలు చేశారన్నారు. హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.