మీరు కొత్త ఫోన్ కొంటున్నారా..అయితే 5జీ ఫోన్ లకే ప్రాధాన్యత ఇవ్వాలని మొబైల్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వచ్చే దీపావళి నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను చేరువ చేస్తానంటూ జియో ప్రకటించింది. ప్రముఖ పట్టణాల్లో వచ్చే 3-6 నెలల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కనుక కొత్తగా ఫోన్ కొనుగోలు చేస్తున్న వారు 5జీ ఫోన్ తీసుకోవడమే సరైనది. రూ.15వేల స్థాయిలో బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్న 5జీ ఫోన్ల వివరాలను గమనిస్తే..
రియల్ మీ 9ఐ 5జీ
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్ సెట్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో వస్తుంది. స్క్రీన్ సైజు 6.6 అంగుళాలు. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా, 50 మెగాపిక్సల్స్ ప్రధాన కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్స్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.14,999
శామ్ సంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఎం 13లో 4జీ వెర్షన్ కూడా ఉంది. ఇది మర్చిపోవద్దు. గెలాక్సీ ఎం13 5జీ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ తో వస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. వర్చువల్ గా ర్యామ్ సైజును 12జీబీకి పెంచుకోవచ్చు. స్క్రీన్ 6.5 అంగుళాలతో, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు, మరో కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్, 126జీబీ స్టోరేజ్ ధర రూ.15,999.
మోటరోలా జీ51 5జీ
6.6 అంగుళాల స్క్రీన్ సైజుతో వచ్చే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 750 జీ చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. స్క్రీన్ కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఇందులో ఆరంభ వేరియంట్ ధర రూ.17,499. బ్యాంక్ ఆఫర్లతో మరికొంత తగ్గుతుంది.
రెడ్ మీ నోట్ 10టీ 5జీ
మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ పై పనిచేసే ఈ ఫోన్ స్క్రీన్ 6.5 అంగుళాలు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ తో కూడిన ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని ధర రూ.15,499.
రియల్ మీ 9 5జీ
ఇది కూడా బడ్జెట్ ధరలో మంచి 5జీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ తో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. స్క్రీన్ రీఫ్రెష్ రేట్ 90 హెర్జ్ గా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.