ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేలెత్తి చూపించేందుకు ఏ ఒక్క అంశమూ లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 02:30 PM

రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు రాజేసి.. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని కాపు, కమ్మ, రెడ్డి కార్పొరేషన్ల ఛైర్మెన్లు అడపా శేషు, తుమ్మల చంద్రశేఖర్, శ్రీ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డిలు మండిపడ్డారు. సంక్షేమం-అభివృద్ధే ఎజెండాగా సాగుతున్న వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి  పరిపాలనలో వేలెత్తి చూపించేందుకు ఏ ఒక్క అంశమూ లేకపోవడంతో, ఆఖరికి కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు దిగజారిపోయారని అన్నారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పై రెక్కీ జరిగితే.. అదికూడా టీడీపీకి చెందినవారే, ఆ సామాజికవర్గంవారే, చంద్రబాబు, కోడెల శివప్రసాద్ లతో ఫోటోలు దిగిన వారే పాల్పడితే, అక్కడ వారిపై కేసు కూడా నమోదైతే.. దాన్ని తీసుకువచ్చి ఆంధ్రా రాజకీయాలకు ముడి పెట్టి, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మెన్ కారు పేరుతో బోర్డును మార్ఫింగ్ చేసి, రెడ్డి, కాపుల మధ్య చిచ్చు పెట్టి, ఈ కులాల మధ్య మంటలు పెట్టాలని చూస్తున్నారని వారు దుయ్యబట్టారు. రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టి.. తద్వారా చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చీప్ ట్రిక్స్ కు  పాల్పడుతున్నాడని వారు ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com