వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ 2 రోజుల క్రితం సీఎం కార్యాలయానికి నివేదించిన కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్రను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారు. సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరోసారి సమావేశమయ్యారు. నిన్న విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లాకలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ. ఆరుద్రతో మాట్లాడారు.