ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నుండి తప్పుకుంటే మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై విచారణ నిలిపేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. ఆప్ ను వీడితే మనీశ్ సిసోడియాను సీఎం చేస్తామన్నారని, ఆయన ఒప్పుకోకపోవడంతో తనను సంప్రదించారని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపాలిటిలో ఓడిపోతామని బీజేపీ భయపడుతుందని అన్నారు.గుజరాత్ లో తామే గెలుస్తామని ఆయన తెలిపారు.