జి.కొండూరు మండలం గంగినేనిలో గ్రామానికి చెందిన దారం రమెశ్, సౌజన్యలకు పదహారేళ్ల క్రితం వివహామవ్వగా, వీరికి ఇద్దరు సంతానం. నాలుగేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు అప్పు చేయగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తెదీన ఇద్దరూ కలిసి గడ్డిమందు తాగారు. రమేశ్ అన్నయ్య వీరిని ఆసుపత్రికి తరలించగా రమేశ్ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు.