అన్నం పెట్టిన ఇంటికే సున్నం వేశారు నలుగురు వ్యక్తులు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన హస్తకళా వ్యాపారి అశోక్ చోప్రా ఇంట్లో నలుగురు సహాయకులుగా పనిచేసేవారు. శనివారం ఆయన తినే ఆహారంలో మత్తుమందు కలిపి, కోట్ల విలువైన నగలు, నగదుతో అతడి కారులోనే పరారయ్యారు. మొత్తం నలుగురు ఈ చోరీలో పాల్గొనగా, వీరిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి కార్ ను నాగౌర్ జిల్లాలోని కుచమన్ వద్ద వదిలేశారు.