గుంతకల్లు రైల్వే డివిజనల్ సెక్యూ రిటి కమీషనర్ మురళీ కృష్ణ ఆదివారం గుత్తి కోటను సందర్శించారు. ఆయనకు గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్, కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గుత్తి కోట గైడ్ రమేష్ వారికి కోట చరిత్రను వివరించారు. గుర్రపుశాల, చీకటి గది, రాణి మహల్ వంటివి చూసిన అధికారులు చరిత్రా త్మకమైన గుత్తి కోటను ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఐపిఎఫ్ బెన్నయ్య, ఆర్పీఎఫ్ అనురాగ్, ఇన్స్పెక్టర్లు కుమార్, రమేష్ గౌడ్, గుత్తి కోట సంరక్షణ సభ్యులు వెంకటరామిరెడ్డి, యువజన అధ్యక్షుడు దేవేంద్ర రాయల్, కన్వీనర్లు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.