చంద్రబాబు- పవన్ కల్యాణ్ కుట్ర రాజకీయాల్లో భాగంగానే.. పార్ట్–1 రెక్కీ, పార్ట్ –2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్ పిచ్చికూతలు మూడు రోజులుగా ఒక సీరియల్ ప్రకారం నడుస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా తొలగించలేదన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ పనికిమాలిన పిచ్చి కూతలు కూస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఇంటి వద్ద రెక్కీ అంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులే స్పష్టంగా చెప్పినా డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి పనికిమాలిన వ్యక్తులు మా ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరన్నారు. చంద్రబాబు హయాంలో వేల ఇళ్లను, వందల ఆలయాలను కూల్చేశారని మంత్రి జోగి రమేష్ గుర్తుచేశారు. గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కళ్లుండి చూడలేని కబోది రామోజీరావు.. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాస్తున్నాడని ధ్వజమెత్తారు.