జాతీయ క్యాన్సర్ అవగాహన దినం కలవచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ వారు ఆధ్వర్యంలో కలవచర్ల గ్రామం, గుర్ల మండలం లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్బంగా క్యాన్సర్ వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా అజరైన డా. చంద్రశేఖర్, మిమ్స్ వైద్యలు క్యాన్సర్ గురించి మాట్లాడుతూ, క్యాన్సర్ అనేది అన్ని వయసు వారికీ రావొచ్చునని, ఈ మధ్యకాలములో మహిళాలకు గర్భశయ క్యాన్సర్ మగవారికి ఊపిరితిత్తులు క్యాన్సర్ అధికంగా వస్తుందని, క్యాన్సర్ ముఖ్యముగా అడ్డపోగ తాగడం, మందు తాగటం మరియు ఆహార అలవాట్లు మార్పులు వల్ల క్యాన్సర్ అధికంగా వస్తుందని చెప్తూ, ముందుగా వ్యాధి పై అవగాహన పెంచుకొని వ్యాధి లక్షణాలును గుర్తించి మందులు తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండవొచ్చునని అన్నారు.
గ్రామ పెద్ద మరియు మండల సి. యాచ్. సి కోఆర్డినేటర్ బి. సుబ్రహ్మణ్యం (మణి )మాట్లాడుతూ, ఇలాంటి అవగాహన కార్యక్రమం మా గ్రామంలో పెట్టడం సంతోషకరమని చెప్పారు. చివరిగా రెడ్ క్రాస్ కార్యదర్శి కె. సత్యం మాట్లాడుతూ, గ్రామ స్థాయి లో ఇలాంటి వ్యాధిలు పైన పూర్తి అవగాహన ఉన్నట్లు ఐతే ముందుగా వ్యాధులు ను గుర్తించి ముందస్తూ, చికిత్స తీసుకోవొచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వై. గోపినాధ్, స్కూల్ చైర్మన్ బి. కుర్మానాద్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ రావు, గ్రామ నాయకులు బి. సంతోష్ మరియు రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ గౌరి, చంద్రరావు ఇతర సిబ్బంది పాల్గున్నారు.