గుర్ల మండలం మన్యుపురిపేట గ్రామంలోనూతనమ్మగా నిర్మించిన ఎరుషలేము ప్రార్థన మందిరం చర్చనుఏపీ టూరిజం డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు. సోమవారం ఉదయం ప్రారంభించారు. రేగాన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా. వారి వారి దేవుళ్ళు పూజించుకోవడం తప్పు లేదని. అందరూ సమాన భావంతో సోదరి స్నేహభావంతో అందరూ ఉండాలని కోరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మీయొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని మనవి చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడకుండా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా మా మేనిఫెస్టో చూస్తే ఒక ఒక భగవద్గీత. కురాన్. బైబిల్. కనిపించేలా చేశామని చెప్పారు. అంతేకాకుండా అర్చకులకు. ఇమాములకు. దైవ సేవకులకు గౌరవ వేతనం ఇచ్చి వారి మంచి మనసును చాటుకున్నారని తెలియజేశారు. వారు చేస్తున్న పరిపాలనలో కొంతమంది దుష్ట శక్తులు ఆటంకాలు సృష్టిస్తున్నారని. అలాంటి వారి మనసు మారేలా మీ అందరూ ప్రార్థన చేయాలని కోరారు. అనంతరం సంఘస్తులచె సన్మాన కార్యక్రమం జరిగినది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవణ సంఘ కాపరి జక్కయ్య స్టీవెన్ పాల్ గారు మొదలగువారు పాల్గొన్నారు