బాపట్ల జిల్లాలోని వేటపాలెం గంగాపార్వతి సమేత భోగలింగేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం తెల్లవారుజామున గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలతో స్వామిని సూర్యభగవానుడు అభిషేకించారు. సుమారు 15 నిమిషాల పాటు స్వామిని కిరణాలు స్పృశించాయి. ఈ అపురూప దృశ్యాలను భక్తులు తిలకించి పరవశించిపోయారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో స్వామిని సూర్య కిరణాలు అభిషేకిస్తుడటం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa