మార్గదర్శి కేసు 16 ఏళ్ళు పూర్తయిందని, మార్గదర్శిని తనిఖీ చేయకుండా ఏపీలో ఉన్న ఛిట్ పండ్ కంపెనీలన్నీ తనిఖీ చేస్తే ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛిట్ పండ్ కంపెనీ నిర్వహించేవారు ఏ వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉందన్నారు. చట్టం తని పని తాను చేస్తుందనేది పచ్చి అబద్దమన్నారు. రామోజీరావుకు ఛిట్ పండ్ కంపెనీకు సంబంధం ఉందా? లేదా? అనేది ప్రభుత్వం నిర్థారించాలన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ జగన్ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదన్న విషయం జనం తెలుసుకోవాలన్నారు.