మహిళా ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికోసం రైళ్లలో ప్రత్యేక బెర్తులు సిద్ధం చేస్తామని ప్రకటించింది. బస్సులు, మెట్రో రైలు సర్వీసులలో మాదిరిగానే మహిళలకు ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. ఎక్స్ప్రెస్ రైలు కోచ్లలో ఆరు బెర్తుల సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.