ఆస్ట్రేలియాలో యువతిపై అత్యాచారం కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ గుణతిలకకు అక్కడి స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. అతని తరపున లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా అనుమతించలేదు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లనున్నారు. గుణతిలకను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.