క్షిపణులు, ఇరాన్ డ్రోన్‌లతో రష్యా విరుచుకుపడుతున్న వేళ మిత్ర దేశాల అండతో ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. ‘నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్స్’ సహా ఆస్పైడ్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. మాస్కో దాడులను తిప్పికొట్టేందుకు ఈ ఆయుధాలు సహాయపడతాయని ఉక్రెయిన్ పేర్కొంది.