రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని... దీని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. పార్టీ సభ్యతం, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, సాధారణ ఓటరు నమోదుపై కార్యక్రమంపై నియోజకవర్గ నాయకులతో శనివారం అల్లూరు గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదుకు ఎక్కువ పాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు చేయించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల ని కోరారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి చిన్న వెంకటస్వామి, హరీ్‌షరెడ్డి, మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేషరెడ్డి, మండల కన్వీనర్లు ఓబుల్ రెడ్డి, ఐటీడీపీ జిల్లా నాయకుడు ముర్తుజావళి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు జయసూరి, మహేశ్వరడ్డి, వలి, నాగలూటి రవి, కౌన్సిలర్ భాస్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు.