ఎలమంచిలి, మండలంలోని పులపర్తి గ్రామంలో 32.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో అమరావతి అనే మహిళ ఇంటి బయట రేషన్ బియ్యం నిల్వచేసినట్టు అందిన సమాచారం మేరకు సోమవారం దాడులు న్విహించినట్టు చెప్పారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ గోదాముకు తరలించామని, కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ ధరల ప్రకారం బియ్యం విలువ సుమారు రూ.97 వేలు వుంటుందని వెల్లడించారు.