‘గడప గడపకు...’ కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబూరావుకు చేదు అనుభవం ఎదురైనది. నాలుగు రోజుల కిందట రాజయ్యపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన్ను...‘హెటెరో’ సంస్థ నిబంధనల ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారని జనం ప్రశ్నించారు. దీంతో పోలీసు అధికారులు బందోబస్తు పెంచారు. తాజాగా సోమవారం పెదతీనార్ల శివారు దొండవాక గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బాబూరావును మత్స్యకార యువకులు నిలదీశారు. హెటెరో ఔషధ పరిశ్రమ పైపులైన్ల ద్వారా ప్రమాదకర రసాయనాలను సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్యసంపద నాశనమవుతోందని ఆందోళనన వెలిబుచ్చారు. సంక్షేమ పథకాలను అర్హులకు కాకుండా వైసీపీ వారికి మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకుండా, గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా పర్యటించడం ఎందుకని నిలదీశారు.