సముద్ర తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెదగంజాం ఎస్‌ఐ కట్టా అనూక్ తెలిపారు. మోటుపల్లి, పల్లెపాలెం, పెదగంజాం సముద్రతీరాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రస్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకొని స్నానాలు అచరించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు. లోతుకు వెళ్లి స్నానాలు చేయరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా మైరన్ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్నానాలు ఆచరించాలని ఎస్‌ఐ కోరారు.