ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడని యాజమాని ఆరోపించారు. అనంతపురం రాంనగర్ లోని మల్లిఖార్జున్ రెడ్డి ఇంటిని మాధవ్ ఎంపీగా గెలిచాక ఆరు నెలలకు ఒప్పందం కుదుర్చుకొని అద్దెకు తీస్కున్నారు. మూడేల్లుగా అద్దె చెల్లించడం లేదని, ఖాళీ చేయడం లేదని యాజమాని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయనని ఎంపీ బెదిరిస్తున్నాడని, 13 లక్షల అద్దె, రెండున్నర లక్షల కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.