ఈ నెల 19న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. తమ డిమాండ్ల సాధనకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) సమ్మెకు పిలుపునిచ్చింది. అసోసియేషన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారనే కారణంతో 3,300 ఉద్యోగులను బదిలీ చేశారని AIBEA ప్రధాన కార్యదర్శి వెంకటాచలం అన్నారు. ఇది ఇరు పక్షాల ఒప్పందం ఉల్లంఘించినట్లేనన్నారు. సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.