శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వ్యాధి నిరోధక టీకాల శ్రీసత్య సాయి జిల్లా అధికారి కృష్ణయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, వ్యాక్సిన్ సీతలీయ కేంద్రాన్ని, డ్రగ్ రిఫోర్ట్ లను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మండలంలోని కేతగాని చెరువు సచివాలయం వద్ద 104 ద్వారా జరుగుతున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఓ పి , మందులు పరీక్ష విధానాలు, మందుల కొరత, ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయని తదితర విషయాలను డాక్టర్ నరేష్ కుమార్ ను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరి కుమార్, జిల్లా జూనియర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్, సి హెచ్ ఓ లు మనోహర్ రెడ్డి, మధు , పర్యవేక్షకులు సుబ్బమ్మ, రవీంద్ర , నారాయణమ్మ , రత్నమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.