దేశంలోని 10 లక్షల అక్రమ రేషన్ కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే, ఆదాయపు పన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేయనుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించనుంది. వరుసగా నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేసేందుకు రెడీ అవుతోంది.