చిలమత్తూరు మండలంలోని కోడూరు పంచాయతీకి చెందిన కోడూరు చెరువులో చేపల పెంపకం, చింతచెట్ల ఫలసాయం, సుబ్బరావుపేట వద్ద చెక్ డ్యాంలో చేపల పెంపకం, ఈత చెట్లు, వారపు సంత, ఆటోస్టాండ్లకు నేడు వేలం పాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మద్యాహ్నం 2 గంటలకు కోడూరు తోపులోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ. 10 వేలను డిపాజిట్ చేసి పాల్గొనాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa