వచ్చే ఎన్నికల్లో వంద శాతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయం సాధిస్తారని, మాకు ఉన్న ధైర్యం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ప్రజలకు ప్రజలకు మంచి చేశారు కాబట్టి మళ్లీ మా పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 5 వేలు మెజారిటీతో గెలుస్తామన్న మా పార్టీ ఎమ్మెల్యే 20 వేల మెజారిటీతో, 20 వేలు మెజారిటీ తో గెలుస్తామనుకునే వాళ్లు 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.